Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం
సీపీఐ, సీపీఐ(ఎం) నారాయణ, జాన్ వెస్లీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించుతామని హెచ్చరిక
నవతెలంగాణ-శంషాబాద్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వెంటనే స్వస్తి పలకాలనీ రాబోవు రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఐ జాతీయ నేత నారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ హెచ్చరించారు. సోమవారం భారత్‌బంద్ నిరసన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌లో జాతీయ రహదారి 44 అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డితో పాటు పక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. శంషాబాద్‌లోని జాతీయ రహదారి 44 పై ని రసన చేసిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఆర్జిఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేష న్ వద్ద వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పెగాసస్ ద్వారా ప్రతిపక్ష పార్టీల, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నతాధికారుల ఫోన్ కూడా చేసి దేశ ద్రోహానికి పాల్పడిందన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు ప్రశ్నించిన దానిని వెల్లడించడానికి నరేంద్ర మోడీ సర్కార్ నిరాకరిస్తున్నదని విమర్శించారు. రైతుల జీవితాలను సర్వనాశనం చేసే రైతు నల్ల చట్టాలను, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్య క్తం చేస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన దేశద్రోహం కేసు చట్టాలను ఆ దేశంలో రద్దు చేసిన ఇప్పటికీ భారతదేశంలో కొనసాగించ డం ఏంటనీ ప్రశ్నించారు. ఉపాధి హామీ, కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కొత్త రైతు చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజల ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బకొట్టారన్నారు. నరేంద్రమోడీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్‌లో టీఆర్ఎస్ ముఖ్యమం త్రి కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా సంకలో కూ ర్చున్నారని విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వా లను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలో పని చేస్తాయని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం లో నాయకులు కాడిగల్ల భాస్కర్, జల్పల్లి నరేందర్, కురుమయ్య ఎన్. మల్లేష్, రుద్రకుమార్, పాలమాకుల జంగయ్య , జైపాల్ రెడ్డి, జిల్లా ఆనంద్, కే. వై. ప్రణరు, జోష్ణ, కె . మల్లేశ్, రాచమల్ల సిద్దేశ్వర్, సంజరు యాదవ్, ఎ. వెంకటేష్, విక్రం, అప్సర్, గడ్డం శేఖర్, ఉదరు తదితరులు పాల్గొన్నారు.