Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యులు కాడిగల్ల భాస్కర్
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
ఈ నెల 23, 24 వ తేదీన షాద్నగర్ పట్టణంలో జరిగే జిల్లా తొమ్మిదవ మహాసభలను జయప్రదం చే యాలని సీపీఐ(ఎం) జిల్లా కోర్ కమిటీ సభ్యులు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, మ హా సభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రాజు అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాలలో జరి గిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పార్టీ పేద ప్రజల కోసం అనేకమైన పోరాటాలు చేసిందని, ఈ ప్రాంతంలో పోరాటాలు చేసి పేదలకు ఇండ్ల స్థలాలతు సా ధించి పెట్టిందని అన్నారు. నిత్యం కార్మికవర్గం కోసం పేద ప్రజల కోసం పార్టీ పనిచేస్తుందని, అలాంటి ఎర్ర జెండా పార్టీ మహాసభలు ఈ ప్రాంతంలో జరగడం ఎంతో ఆనం దంగా ఉందన్నారు. షాద్నగర్ పట్టణ ప్రజలు ఈ మహా సభల విజయవంతం కోసం కృషి చేయాలని అన్నారు. అదేరకంగా పార్టీలో పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్య కర్త అహర్నిశలు కృషి చేసి సభలు విజయవంతం చేయాలని అన్నారు. ఎర్రజెండా ఉద్యమాలతో మమేకమైన ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారని ఇలాంటి ప్రాంతంలో పార్టీ నిర్వహిం చబోతున్న తొమ్మిదవ జిల్లా మహాసభలు ప్రతి ఒక్కరూ జయప్రదం కోసం కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బిసా సాయిబాబు, నాయకులు ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్, ప్రశాంత్, చంద్రమౌళి, శివారెడ్డి, శివ, శ్యామ్, శ్రీను, మినాజ్ బేగం, లక్ష్మి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.