Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నా మోడీ
మాయమాటలతో ప్రజలను
మభ్యపెడుతున్న కేసీఆర్
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రామచందర్
మాడ్గుల పార్టీ మండల ప్రథమ మహాసభ
నవతెలంగాణ - మాడ్గుల
బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలు అవుతుందని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రామచందర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్లో పార్టీ మండల ప్రథమ మహాసభ లను మండల కమిటీ సభ్యుడు పందుల నరసింహగౌడ్, కట్ట అంజయ్య అధ్యక్షతన నిర్వహించారు. అంతకుముందు మండలంలో బైకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఛారు వాలా అని భారత దేశానికి ప్రధాని అయి, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు. రైల్వేలు, ఎల్ఐసీ, బ్యాంకులు వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మి వేస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకులు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకుండా, ఏడు వందల మంది రైతులు చనిపోయిన ఉద్యమాలు చేసిన మోడీ సర్కార్ పట్టించుకోకపోవడంలో అంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విభజించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల్ని మరోసారి మోసం చేయడానికి దళిత బంధు పేరుతో రూ. 10 లక్షల ఇస్తానని అంటు న్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి మోసం చేసాడని, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులు సాగు చేసుకున్న భూమిని బలవంతంగా ప్రాజెక్టుల పేరుతో సెజ్‌ల పేరుతో బలవంతంగా లాక్కుంటున్నాడని విమర్శించారు. సిరిసంపదలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కందుకూరు జగన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని పోరాడి సాధించుకున్న దానిని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయడం కోసం కుట్ర పన్నుతున్నాయని అన్నారు. కూలి భూమి పోరాటాలు, దళితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు సాధించే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నాడు. జిల్లా కమిటీ సభ్యుడు కందుకూరు జగన్ మాట్లాడుతూ మాడ్గులలో పేదలకు పార్టీ అండగా ఉంటుదన్నారు. మండలంలో రైతు, వ్యవసాయ కూలీలకు, అసంఘటిత కార్మికులకు, ఉపాధి కూలీలకు అదేవిధంగా ప్రభుత్వ పరంగా అర్హులైన పేదలందరికీ అందాల్సిన ప్రభుత్వ పథకాలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు పి. అంజయ్య, ఈర్ల నర్సింహ, కట్ట అంజయ్య పందుల నరసింహగౌడ్, పులికంటి రమేష్, చిన్ని కష్ణ, పులికంటి శేఖర్, పల్లేటి నరసింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మండల నూతన కమిటీ కన్వీనర్ గా కట్ట అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా పులికంటి రమేష్, ఈర్ల నరసింహ, పందుల నరసింహ, సు గురి సీను, పులికంటి శేఖర్, పందుల శీను ఎన్నుకున్నారు.