Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా సర్వ సభ్య సమావేశంలో గళం విప్పిన స్థానిక ప్రజా ప్రతినిధులు
సభకు గైర్హాజరైన మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ సభ్యులు ఆందోళన
నిధుల పంపిణీ విషయంలో చైర్‌పర్సన్‌ను నిలదీసిన అధికార పార్టీ సభ్యులు
చైర్పర్సన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందంటూ సభ్యులు ఆందోళన
పోడియం వద్ద నేలపై బైటాయించిన యాచారం ఎంపీపీ, కందుకూరు జడ్పీటీసీ
జడ్పీటీసీకి వార్నింగ్ ఇచ్చిన చైర్పర్సన్
మంత్రి సముదాయించడంతో.. సద్దుమనిగిన ఆందోళన
అమానానికి గురై, సభను వాకౌట్ చేసిన అధికార పార్టీ కుందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి
సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తాం : మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా సర్వ సభ్య సమావేశం వాడివేడిగా సాగింది.. గౌవరం లేని పదవులు మాకేందుకంటూ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా ఎంపీపీ, జడ్పీటీసీలు స్థానిక సంస్థల సమస్యలపై సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కోవిడ్-19 నేపథ్యంలో కొద్ది కాలంగా ప్రత్యేక్ష సమావేశాలు, సమీక్షలు లేకపోవడంతో స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి చొప్పుకోవలో తెలియని పరిస్థితి. చాల రోజుల తర్వాత జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించడంతో సమస్యల చిట్టతో వచ్చిన సభ్యులకు నిరాశే మిగిలింది. సభకు ఇద్దరు ఎమ్మెల్యేలు, మంత్రి తప్ప మెజార్టీ సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నలేదు. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, మండల సమావేశాలకు రాని ఎమ్మెల్యేలు ఇక్కడికైనా వస్తారేమో తమ గోడు చెప్పుకుందామంటే ఇక్కడికి సైతం రాలేదు. ఇగ మా సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడికి రావాలంటూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఆశతో సమావేశానికి వచ్చిన సభ్యులు ఉసురు మంటూ వెనుదిరిగారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఖైరాతాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం పచ్చగడ్డి మీద అగ్గిలా సాగింది. నిధులు, విధుల సమస్యలపై పార్టీలకు అతీతంగా సభ్యులు గొంత్తెతి చైర్‌పర్సన్‌పై ప్రశ్నాల వర్షం కురిపించారు. స్వయాన అధికార పార్టీకి చెందిన కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులను చైర్పర్సన్ కనీసం గౌరవించడం లేదని తమ ఇష్టానుసారంగా నిధులు కేటాయిస్తోందని ఆరోపించారు. యాచారం ఎంపీపీ సుకన్య భాష తమకు ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదని ఎంపీడీవో తమ కులం పేరుతో దూషించి అవమానానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం చేయడం లేదని పోడియం వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేసింది. మంచాల జడ్పీటీసీ నిత్యనింజర్రెడ్డి తమకు ఎంపీడీవో ఆఫీసుల్లో ఉన్న చాంబ ర్కు తాళం వేశారని, మేము ఎక్కడ కూర్చోవాలో కలెక్టర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము కూడా ప్రజా ప్రతినిధులమే..అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఒక న్యా యం..మాకో న్యాయం అంటూ సభ అధ్యక్షురాలిని నిలదీ శారు. పలువురు సభ్యులు తమ మండలాల్లో ఎదుర్కొం టున్న సమస్యలను సభలో లేవనెత్తారు. ముఖ్యంగా వ్యవసాయం, రైతుబంధు, రైతు బీమా, పంట నష్ట పరిహారం, వైద్యం, పాఠశాల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై, ఇటీవల కురిసిన వర్షాల కారణంలో పాడైన రోడ్ల నిర్మాణాలపై సభలో ప్రధానంగా చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన పలు పశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సభకు హాజరైన మంత్రి సబితా ఇంద్రరెడ్డి, కలెక్టర్ అమోరు కుమారు
పలువురు సభ్యుల లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లుతున్నామని, అభివద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కషి చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని గ్రామ స్థాయిలో గ్రామపంచాయతీ పేరున, మున్సిపాలిటీలలో మున్సిపాలిటీల పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. ఈ నెల 17నుంచి గ్రామాల్లోని గ్రామ ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోని ప్రభుత్వ భూములను వంద శాతం గుర్తించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశాల్లో మండల అధికారులు తప్పకుండా హాజరుకావాలని, హాజరు కాని వారి పేర్లను జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకువెళ్లితే వారిపై చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.
వికలాంగుల కోసం నిర్వహించే సదరన్ క్యాంపు కొండాపూర్, వనస్థలిపురంలో ఉన్నందున వికలాంగులకు ప్రయాణం చేయడం కష్టమవుతుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రికి తెలుపగా మంత్రి స్పందిస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్లో సదరం క్యాంప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
అర్హులైన వారికి పింఛన్లు అందించాలని జడ్పీటీసీ వెంకటేష్ కోరగా తప్పక అందచేస్తామని మంత్రి బదులిచ్చారు. రైతు వేదిక ద్వారా రైతులకు లాభం వచ్చే పంటలు కూరగాయలు, పప్పు దినుసులు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు బీమా ఆన్లైన్లో నిరంతరం చేసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. రేషన్ కార్డులు అర్హులైన వారిని గుర్తించి అందజేస్తామని, రేషన్ కార్డు రాని వారికి కూడా ఇస్తామని తెలిపారు. అధిక వర్షాలు పడినందుకు రైతులకు పంట నష్టం చెల్లించాలని జడ్పీటీసీలు కోరగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
భూ సమస్యలపై జిల్లాలో 80 వేల దరఖాస్తులు వచ్చాయని అందులో 72 వేల దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించడం జరిగిందని, మిగిలిన ఎనిమిది వేల దరఖా స్తులను కూడా త్వరలో పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ అమోరుకుమార్ తెలిపారు. యాసంగిలో వరి ఎక్కువగా పండినందున గన్ని బ్యాగులు కొరత వచ్చిందని ఈసారి ముందుగానే గన్ని బ్యాగుల కోసం ఆర్డర్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలని, టీచర్లు లేనిచోట వెంటనే నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్, మంచి నీటి సౌకర్యాలు కల్పించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. కోవిడ్ సమయంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలకుగాను మంత్రి, ఇతర సభ్యులను అభినందించారు. వ్యాక్సిన్ ఇవ్వడంలో కూడా రంగారెడ్డి జిల్లాలో 90 శాతం వరకు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత గురించి, పరికరాలు, భవనాలు గురించి నివేదిక వెంటనే ప్రజా ప్రతినిధులతో చర్చించి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదరు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మండలంలో సదరన్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలి : వెంకట్, తలకొండపల్లి జడ్పీటీసీ
జిల్లాలో రెండు కేంద్రాల్లో మాత్రమే సదరన్ క్యాంప్ నిర్వహించడంతో వికలాంగులు క్యాంప్‌కు వెళ్లలేక పోతున్నారు. మెడికల్ సర్టిఫికెట్ లేక పోవడంతో పింఛన్‌కు అర్హులైన వికాలాంగులు లబ్ది పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరతో మండలం లేదా.. రెవెన్యూ డివిజన్ పరిధిలోనైనా ఏర్పాటు చేయాలి. పెండింగ్‌లో పింఛన్లు మంజూరు చేయాలి. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి.
ఆవుల కోసం డీడీ చెల్లించి నాలుగేండ్లు.. ఇప్పటికి ఇవ్వలేదు : నర్మద, ఎంపీపీ
తలకొండ పల్లి మండలంలో విజయ డెయిరీ సొసైటీ కింద ఆవుల కోసం రైతులు తమ వాటా కింద రూ. 40 వేలు చెల్లించి నాలుగేండ్లు అవుతుంది. ఇప్పటికీ ఆవులు ఇవ్వలేదు.. వడ్డీకి తెచ్చిన డబ్బులకు మిత్తి రెండింతలు అయింది కానీ.. ప్రభుత్వం ఆవులు ఇవ్వడం లేదు.. దీనిపై మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని రైతులు ఆదుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లు ఇవ్వకపోవడంతో.. ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వండటం లేదు. పిల్లలు ఇంటి నుంచి టీఫిన్ బాక్స్‌లు తీసుకుపోతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఈ సమస్యను పరిష్కరించి.. పిల్లలకు నాణ్యమైన భోజనం అందిచేందుకు కృషి చేయాలి.
అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి : దాస్, అబ్దులాపూర్‌మెట్ జడ్పీటీసీ
అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కడ కూడా విద్యుత్ సౌకర్యం లేదు. పిల్లలు ఇరుకు గదుల్లో ఫాన్లు లేక ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి. అంగన్వాడీ కేంద్రాలకు భోజనం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన భోనం అందించడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
స్థానిక ప్రజాప్రతినిధులను జడ్పీ చైర్పర్సన్ లెక్క చేయడం లేదు : జంగారెడ్డి, కందుకూర్ జడ్పీటీసీ
కందుకూర్ మండల అభివృద్ధి కోసం జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రూ.3కోట్లకు పైగా నిధులు కేటాయించింది. కానీ ఈ విషయమై నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. దీనిపై జడ్పీ చైర్‌పర్సన్‌ను అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ దురుసుగా ప్రవర్తించారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడడం జడ్పీ చైర్‌పర్సన్‌కు సరికాదు. మండలానికి కేటాయించే నిధులు విషయంపై మాకు సమాచారం ఇవ్వాలి.