Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులుగా ఢిల్లీ శ్రీధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ముదిరాజ్ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భైరమోని మల్లేష్ అన్నారు. ఆదివారం కందుకూరు మండలం లేమూరు గ్రామానికి చెందిన ఢిల్లీ శ్రీధర్‌ను జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం నిరుపేద ముదిరాజులకు వ్యక్తిగతంగా రుణాలు అందజేసి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల వెంకటేష్, ఢిల్లీ వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు పిట్టల మల్లేష్, నాయకులు యాదయ్య, ఈశ్వరయ్య, నారాయణ, శంకరయ్య, మహేందర్, సురేష్, మహేష్ పాల్గొన్నారు.