Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన్ సాహస్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్
నవతెలంగాణ-దోమ
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచే స్తున్న కార్ముకులకు ఈ శ్రామ్ కార్డులు తప్ప నిసరిగా కలిగి ఉండాలని జన్ సాహస్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈ శ్రామ్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వంతో జ న్ సాహస్ సంస్థ ఒప్పందం చేసుకుని అసంఘటిత రంగం లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికీ తమ సంస్థ ద్వారా ఉచితంగా కార్డు నమోదు చేసి ప్రింట్ ఇ స్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ప త్రిక, ఎలక్ట్రానిక్ మీడియా రంగం వారికి కూడా ఈ అవకాశం ఉందన్నారు. జర్న లిస్ట్ మిత్రులు ఈ కార్డులు కూడా పొందా లన్నారు. ఈ శ్రామ్ కార్డు లాభాలు ప్రమాదవశాత్తు మృతి చెందితే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా రూ.2 లక్షల ఇన్సురెన్సు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. లక్ష ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల పొందాలంటే ఈ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.