Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
ఈ నెల 14న ఆమనగల్లులో బుద్ధ ఫూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నట్టు బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి తోకల సంజీవ్ అన్నారు. ఆదివారం కందుకూరు మండల కేంద్రం లో బుద్ధ ఫూలే అంబేద్కర్ జాతర రథాన్ని మాజీ సర్పంచ్ మన్నె జయేందర్, కందుకూరు ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బు ద్ధ ఫూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేయా లన్నారు. అక్టోబర్ 14న 1956లో బీఆర్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు అన్నారు. అందుకే ఆ రోజు ఘనంగా నిర్వహించాలన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రఘురాం రాథోడ్, మాజీ జెడ్పీటీసీ పెద్ద రామయ్య, కొమ్మల నరసింహ ప్రధాన కార్యదర్శి కేజీ శంకర్, ఎల్లయ్య, యాదయ్య, బాలరాజు, వెంకటయ్య, ఉస్మాన్, నరసింహారెడ్డి, రాములు పాల్గొన్నారు.