Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షులు జయకృష్ణ
నవతెలంగాణ - బొంరాస్‌పేట్
నిరుద్యోగ సమస్యపై, లక్ష 50 వేల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, నిరుద్యోగ జంగ్ సైరన్ చేపట్టిన టీపీసీసీ రేవం త్‌రెడ్డిని అరెస్టు చేయడం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జయ కృష్ణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నందార్‌పూర్ గ్రామంలో కాంగ్రెస్ మండల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమం త్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై అతికిరాతంగా లాఠీచార్జి చేయడం బాధాకరం అన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లే అని ఆరోపించారు. సత్య, అహింస, ధర్మాలను అస్త్రాలను చేసి పోరాటం చేసిన మహాత్ముడు పుట్టిన రోజు, జై జవాన్.. జై కిషాన్ అని నినదించిన లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినాన ఇలాంటి నియంత పాలన చేయడం సరికాదని హెచ్చరించారు. ఇలాగే చేస్తే తండ్రి, కొడుకులను ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్‌రెడ్డి, నర్సింలుగౌడ్, రాంరెడ్డి, సంతోష్‌నాయక్, మల్లికార్జున్, రవినాయక్, నర్సింలు నాయుడు, విజరు, ఆనంద్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.