Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
చేప పిల్లల పంపిణీ
నవతెలంగాణ-కొత్తూరు
మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టినట్టు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని మత్స్యకారులకు మూడు లక్షల 93 వేల 600 చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మత్స్యకారుకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. చెరువులు, కుంటలపై ఆధారపడి జీవనో పాధి పొందుతున్న మత్స్యకారులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను తీసుకుని వాటిని సంరక్షించి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మ న్ ఈట గణేష్, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారా యణ, బాతుక దేవేందర్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, తిమ్మాపూర్ ఎంపీ టీసీ చింతకింది రాజేందర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ బ్యాగరి యాదయ్య, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనే యగౌడ్, కమ్మరి జనార్దన్‌చారి, గూడూరు సర్పంచ్ బ్యాగరి సత్తయ్య, చేగురు పీఏసీఎస్ వైస్‌చైర్మన్ మున్నూరు పద్మా రావు, రవినాయక్, మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ అంజ య్య ముదిరాజ్, వీరమోని శ్రీనివాస్‌ముదిరాజ్, టీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి శిరాజ్, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.