Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి
గన్నోజు మహేష్‌చారి
నవతెలంగాణ-కందుకూరు
రాష్ట్రంలో బహుజనులందరూ ఏకమై సీఎం కేసీఆర్ నియంతను గద్దె దించాలని బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నోజు మహేష్‌చారి పిలుపునిచ్చారు. ఆదివారం టంకరి రామ్‌రెడ్డి కళ్యాణ మండపంలో బీఎస్పీ కందుకూరు మం డలం కన్వీనర్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తు న్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముం దు నీళ్లు, నిధులు, మన ఉద్యోగాలు మనకే అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వం విధి విధానాలు ఒక్కటే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు తిరగబడతారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం బీఎస్పీ మండల కన్వీనర్లను ఎంపిక చేశారు. గులివి గణేష్, లక్ష్మి, విమల, జయసుధ నియామకం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి గుడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె కిరణ్ కుమార్, రజినీకాంత్, శ్రీనివాస్, శేఖర్, కార్తీక్, సామెల్, రాజు, మహేష్, వెంకటేష్, మహేందర్, అశోక్, పెంటయ్య, సంపత్, అరుణ్, గిరి, భాగ్యరాజు, శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.