Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 8న జరిగే సమ్మెను కార్మికులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లికార్జున్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో 12 గంటలు పని చేయించుకొని వారికి నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని అన్నారు. ఎక్కడా కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతన జీవోలు 73 ఉండగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 5 జీవోలను జారీ చేసింది, వాటికి గవర్నర్ ఆమోదముద్ర వేయిం చాలి కానీ అది కూడా జరగకుండా పెట్టు బడిదారులు అడ్డుకుం టున్నారని అన్నారు. కార్మికులందరూ ఐక్యమత్యంతో పోరాడితే సమస్యలను త్వరలో పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ఈనెల 8న జరిగిన సమ్మెలో కార్మికులు అందరూ విధిగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్, రుద్రకుమార్, జిల్లా కోశాధికారి మల్లేష్, శ్రామిక మహిళ జిల్లా అధ్యక్షురాలు కవిత, జిల్లా సహాయ కార్యదర్శి కురుమయ్య, మండల కమిటీ సభ్యులు గట్టయ్య, మోహన్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.