Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేవీవీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సురేష్
రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ- మీర్పేట్
సైన్సు ఆలోచన మన జీవన విధానం కావాలని తెలం గాణ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సురేష్ అన్నారు. ఆదివారం జిల్లాలగూడలో జన విజ్ఞాన వేదిక రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు నేడు ఆశాస్త్రీయతను, మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ సైన్సును అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ప్రతి సైన్స్ కార్యకర్త అలాంటి మూఢాచారాలను, మూఢన మ్మకాలను తిప్పికొడుతూ సైన్సు ప్రచారం చేయాలని పిలు పునిచ్చారు. ప్రస్తుతం విద్యార్థులలో శాస్త్రీయ భావాలను పెంపొందిస్తూ ఎందుకు, ఏమిటి, ఎలా అని నేర్పడం వలన విద్యార్థులు సైన్సును అలవర్చుకుంటారని తెలిపారు. సైన్సును పెంపొందించేందుకు జెవీవీ కార్య కర్తలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జన విజ్ఞాన వేదిక నూతన కమిటీని ఎన్నుకు న్నారు. గౌరవ అధ్యక్షులుగా రాజేశ్వరరావు, జగన్మోహన్ రావు, అధ్యక్షుడుగా యూవి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి గా సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా ప్రకాష్, కార్యదర్శివర్గ సభ్యు లుగా టీవీజీకే రాజు, జహంగీర్, కృష్ణమోహన్్, కుర్మయ్య, రాములయ్యలతో పాటు మరో 9మంది సభ్యులతో మొత్తం 19 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుకర్, భాస్కర్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.