Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్వాల్‌గూడ యూపీఎస్
హెచ్ఎం గోపాల్ రెడ్డి
పాఠశాలలో ఘనంగా
బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ- శంషాబాద్
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా పాఠ శాలలు తెరుచుకోక ఆందోళనలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులకు బతుకమ్మ సంబరాలతో నూ తన ఉత్తేజం వెల్లివిరుస్తున్నదని మండల పరిధిలోని కొత్వాల్‌గూడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు లు ఎం. గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా హెచ్ ఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మన పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. సీనియర్ ఉపాధ్యాయుడు దార బాలరాజు మాట్లాడుతూ ఆటపాటలు సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయో గపడతాయనీ అన్నారు. కరోనా అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సంబరాలు చేసుకోవడం ఇదే ప్రథ మన్నారు. కార్యక్రమంలో పగడాల రఘునందన్‌గౌడ్, మా జీ హెచ్ఎం నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు లిల్లీ రొస్లిన్, సు ధా నీరజ, లక్ష్మి, చందన్రావు, విద్యాకర్ పాల్గొన్నారు.