Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్లో గల శాంతినికేతన్ మోడల్ హై స్కూల్లో మంగళవారం కరస్పాండెంట్ కోస్గి శ్రీనివాస్ విద్యార్థు లతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి చుట్టూరా తిరుగుతూ ఆడి పాడి బతుకమ్మ పండుగకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కోస్గి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థు లకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటిగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారని అమావాస్యతో మొదలై ఆశ్వయుజ అష్టమి రోజున ముగుస్తాయని అన్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై చివరి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని తెలిపారు. మొదటి రోజు ఎంగిలిపూల బతు కమ్మ, రెండోవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతు కమ్మ, నాలుగోవ రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమి దవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా పిలుచుకొని పూజలు చేసి ఘనంగా నిర్వహించుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవి ప్రిన్సిపాల్ జయేందర్రెడ్డి, ఉపాధ్యాయులు దేశ్యా, జోసెఫ్, శ్రీను, సరిత, పుణ్యమ్మ, మౌనిక, రేణుక, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు.