Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కుల, మతాలకు అతీతంగా ఐక్యతతో జరుపుకు నే, బతుకునిచ్చే బతుకమ్మ పండుగ సంద్భరంగా యావత్ ప్రజానీకానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో పువ్వులను పూజించే ఏకైక సంస్కృతి తెలంగాణలో మాత్రమే ప్రత్యేకమై నది అని, బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండుగ కావడంతో సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని మంత్రి పేర్కొన్నారు.