Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
చంద్ర మోహన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెలో కార్మికులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్ర మోహన్ అన్నారు. బుధవారం కాటేదాన్ క్లస్టర్ పరిధిలోని విజయ ఆయిల్ మిల్, ఇతర పరిశ్రమలకు కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్తో కలిసి చంద్రమోహన్ సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కాటేదా న్లో ఇప్పటివరకు కార్మిక చట్టాలు అమలు కాకపోవడం బాధాకరం అన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికా రులు కంపెనీ యాజమాన్యాలకు అమ్ముడు పోతున్నారని ఆయన అన్నారు. కార్మికులందరూ ఐక్యమత్యంతో పోరా డితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నా రు. కార్మికులతో 12 గంటలు పని చేయించుకుని వారిని పూర్తిగా శ్రమదోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు. పరిశ్రమలో ఎక్కడా కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే 8వ తేదీన రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహి స్తున్నామని, ఈ సమ్మెలో కార్మికులు అందరూ విధిగా పాల్గొ ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా నాయకురాలు. యాదమ్మ, కేతమ్మ తదితరులు పాల్గొన్నారు.