Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్లీన్ ఇండియా కార్యక్రమంలో అందరిని భాగస్వామ్యం చేయాలి
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందు కు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో నెహ్రు యువజన కేంద్రం ఆధ్వర్యంలో సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న '' ఆజాదీ కా అమృత్ '' మహౌత్సవంలో భాగంగా ఈ నెల 1వ తేది నుంచి 31వ తేది వరకు క్లీన్ ఇండియా కార్య క్రమం చేపట్టినట్టు తెలిపారు. దీనిలో అందరినీ భాగస్వా మం చేయాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిరోజూ ఇంటింటికీి చెత్తను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ ద్వారా కలిగే నష్టాలు ప్రజలు వివరించి ప్లాస్టిక్ వాడ కాన్ని పూర్తిగా తగ్గించేలా అవగాహన కల్పించాలని పంచా యతీ అధికారులకు సూచించారు. మహిళా సమాఖ్య గ్రూపు సభ్యుల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్లాస్టిక్ నిర్ములనపై అవగ ాహన కల్పించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా కళాజాత బృందాలతో కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని యువజన కేంద్ర అధికారికి సూచించారు. క్లీన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో 700 వందల కిలోల వరకు ప్లాస్టిక్‌ను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటామని యూత్ వెల్ఫేర్ అధికారి అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అడిషనల్ పీడీ జంగారెడ్డి, జిల్లా యువజన శాఖ అధికారి ఇసయ్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, డీఈవో సుసిందర్ రావు, జిల్లా యువజన క్రీడల అధికారి ఈ. వెంకటేశ్వరరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.