Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నిఖీల హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీఓ లు, ఎంపీవోలు, ఏపీఓలు, గ్రామ కార్యదర్శులతో గ్రామంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ది పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు అందరు స్థానికంగా ఉండాలని, ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుంచి పారిశుధ్యం, పరిశుభ్రత పనులను చేయించా లన్నారు. ఉదయం చేపట్టిన పనులన్నీ క్షేత్రస్తాయిలో గ్రామ కార్యదర్శులు పని చేయిస్తున్నట్లు కలెక్టర్ లాగిన్ లో స్క్రీన్ షాట్స్ పెట్టాలన్నారు. ప్రతి రోజు గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్ ల వద్ద పనులను పరిశీలించాలని, ఉపాధి హామీ కూలీలు చేపట్టిన పనులను పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీఓ కృష్ణన్, ఎంపీడీఓలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.