Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదిహేను రోజులైనా పట్టించుకోని అధికారులు
రోడ్డుకిరువైపులా నడవాలంటే సాహసమే
నవతెలంగాణ-శంషాబాద్
అంతర్జాతీయ విమానాశ్రయంతో గుర్తింపు పొందిన శంషాబాద్ పట్టణం అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఏ కాలనీకి వెళ్ళిన డ్రయినేజీ పొంగి పొర్లు తున్నది. ప్రధాన రహదారుల్లో నెలల తరబడి మురుగు పొంగి వాహనదారులను వ్యాపారస్తులను సాధారణ పౌరులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. శాశ్వ త ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అధికారులు మున్సిపల్ పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుంచి షాబాద్ రోడ్డులోని ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ వరకు రోడ్డుపై నెలల తరబడి మురుగు పారుతున్నది.
స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమలు జరగడం లేదన్నదానికి ప్రత్యక్ష ఉదాహర ణగా శంషాబాద్- రాల్లగూడ-షాబాద్ రోడ్డు. ఏండ్ల తరబడి డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై రోడ్డుమీద మురుగు పారుతుంటే శాశ్వత చర్యలు చేపట్టి సమస్య పునరావృతం కాకుండా చూడాల్సిన అధికారులు తూతూ మంత్రంగా చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ పేరుతో నిధులు కేటాయించి కార్యక్రమాలు చేయాలని ప్రత్యేక కార్యక్రమా లను అప్పగించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రెండు వందల మంది పారిశుధ్య కార్మికులు కోటీ రూపాయలతో అత్యాధునిక సామాగ్రిని వీటిని నిర్వహిం చడానికి ప్రత్యేక శానిటేషన్ అధికారులను, కమిషనర్లను నియమించిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా నిర్వహణ సాగుతున్నది. శంషాబాద్ పట్టణంలో కాలేజ్, స్కూల్స్ విద్యార్థులతో పాటు వివిధ ఆస్పత్రులకు వచ్చే రో గులు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు అత్యంత రద్దీగా శంషాబాద్- షాబాద్ రోడ్డు ఉంటుంది. నిమిషానికి వంద ల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రోడ్డుపై 15 రోజులుగా సరోజన మెడికల్ హాల వద్ద మ్యాన్ హౌల్ నుంచి పొంగిపొర్లుతున్నది. మెడికల్ హాల్ పక్కనే మ్యాన్ హౌల్ పైపుల నుంచి మురుగు ఉబికి బయటకు వస్తున్నందున సరోజన మెడికల్ హాల్ వద్ద రోజుల క్రితం తవ్వి వదిలే శారు. దీంతో మెడికల్ షాపుతో పాటు చుట్టుపక్కల ప్రదే శాల్లో తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతున్నది. ఆర్బినగర్, మధురనగర్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ వాసులు అనేక ర కాల రోగాల బారిన పడుతున్నారు. ఇటీవలనే ఒక కౌన్సిలర్ భర్త డెంగీ వ్యాధి బారినపడి ఆస్పత్రి పాలై కోలుకున్నారు.
శంషాబాద్ బస్‌స్టేషన్ నుంచి ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు రోడ్డుపైన నడిచే పరిస్థితి లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగాలు ప్ర బలితే ఎవరిది బాధ్యత అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బస్ స్టేషన్ నుంచి సరోజన మెడికల్ హాల్ వరకు పైపులు పెద్దగా ఉంటే ఆ తరువాత డ్రయినేజీ పైపులు చిన్నవిగా ఉన్నాయి. పై నుంచి వచ్చే మురుగు నీటి ప్రవాహం చిన్నపె ౖపుల్లో పట్టకపోవడంతో డ్రయినేజీ బయటికి పొంగుతున్నది. దీన్ని సరి చేయాల్సిన అధికారులు తూతూమంత్రపు చర్యలతో నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు వెంటనే చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.