Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్వైజర్ కళ్యాణి
నవతెలంగాణ-శంకర్పల్లి
అంగన్వాడీ చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని అంగన్ వాడి సూపర్వైజర్ కళ్యాణి అన్నారు. మంగళ వారం టంగుటూర టంగుటూరు సెక్టార్ కింద రామంతాపురం కేంద్రంలో అంగ న్వాడీ సూపర్వైజర్ కళావతి ఆధ్వర్యంలో కూరగాయలు, ఆకు కూరలతో బతుకమ్మను తయారు చేసి, బతుకమ్మ ఆడారు.అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు సరైన పోషకాలు అందించాలని సూచించారు. పాలు గుడ్లు తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి, ఆలోచన, సద్గుణ, భాగ్యమ్మ, ప్రమీల, కల్పనా, లక్ష్మి,ప్రేమలత, సుజాత, సువర్ణ, మోకిలా యాదమ్మ, భారతమ్మ, చంద్రకళ, సరస్వతి, పుష్ప, సునీత ఉన్నారు.