Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
సహజసిద్ధమైన ఎరువులతోనే లాభదాయకమని తెలంగాణ రాష్ట్ర ఇన్స్టిట్యుట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధికారి రాఘవేంద్ర రావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన కంపోస్టు యార్డులో తయారయ్యే ఎరువు ప్రక్రియను టీఎస్ఐపీఏఆర్డీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా నుంచి 40 మంది, పంచాయతీ కార్యదర్శుల శిక్షణా బృందం పరిశీలించారు. కంపోస్టు ఎరువు తయారు చేయుటపై, తడి,పొడి చెత్త వేర్వేరు చేయడంపై రకాలుగా గ్రామానికి ఆదాయం ఎలా సమకూర్చుకోవచ్చో తదితర విషయాలపై బృందానికి శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సిహెచ్ స్వప్న మోహన్, ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, ఎంపీవో గీత, బయోటెక్ ఇన్చార్జి శారద, గ్రామ కార్యదర్శి హరికృష్ణ, ఈ బందానికి వివరించారు. దీంతో నారాయణపేట జిల్లా కార్యదర్శులు మాట్లాడుతూ చందిప్ప గ్రామంలో వారు చేసిన విధానం బాగుందని అభినందించారు. సహజసిద్ధంగా తయారు ఈ పక్రియ ఎంతో ఆరోగ్యంతో పాటు లాభదాయకం ఉంటుదని చెప్పారు. ప్రక్రియలో భాగంగా ఈ విధానాన్ని కూడా తమ జిల్లాలోని పలు గ్రామాలలో అమలు పరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని బృందం వివరించింది. దీని ద్వారా తమ గ్రామాల్లో కూడా ఆదాయవనరులు పెంచుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో నారాయణపేట జిల్లా నుంచి వచ్చినభగవాన్ రెడ్డి, చందిప్ప గ్రామ ఉపసర్పంచ్ స్వర్ణలత శివరాం, వార్డు సభ్యులు గోపాల్ రెడ్డి , ముకుందం, మల్లేష్ ,గోపాల్, నవీన్ ,భాస్కర్, నర్సింలు తదితరులు ఉన్నారు.