Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిపో మేనేజర్‌కు విద్యార్థులు వినతి
నవతెలంగాణ-తాండూరు రూరల్
బస్సులు సమయానికి అనుగుణంగా నడ పాలని తాండూరు మండలం బెల్కటూరు చంద్ర వంచ కరన్ కోటా ఓగిపూర్ గ్రామాలకు చెందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, కాంగ్రెస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం తాండూ రు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ్లలో సకాలంలో బస్సులు నడపాలని కోరారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు రావల్సిన బస్సు రాత్రి 8.30 గంటలకు వస్తుందనీ, అది కూడా కరణ్ కోట్ ఎస్ఐ ఏడుకొండలు డిపో మేనేజర్‌తో మాట్లాడినందుకు వేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసిం చడానికి తాండూర్‌కు వస్తారని చెప్పారు. బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు, కళాశాలలకు హాజ రు కాలేకపోతు న్నారని అవేదన వ్యక్తం చేశారు. వీరిలో ప్రధానంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని వివరిం చారు. కానీ ఆర్టీసీ అధికారులు సమయానికి బస్సులు ఏర్పాటు చేయడంలో ఘోరం గా విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. అధి కారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సబంధిత అధికారులు స్పం దించి, విద్యార్థులు కళాశాల, పాఠశాలలకు సకా లంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని కోరారు.