Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్
చిన్నారుల భవితవ్యం ప్రశ్నార్ధకమవుతోంది. ఆటాపాటలతో గెంతులేస్తూ చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన బాల్యం బిక్షాటన చేస్తోంది. పట్టుమని పదేండ్లు కూడా నిండని చిన్నారులు వారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్లో జాతీయ రహదారి 44 ఆనుకుని ఉన్న ఎస్ బావర్చి, ఎయిర్పోర్ట్ బావర్చి, సంగీత మొబైల్స్ హైదరాబాద్ గ్రాండ్, హైదరాబాద్ హౌస్ వంటి పెద్ద పెద్ద హౌటల్లో షాపింగ్ మాల్స్ రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఈ చిన్నారులు సంచరిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు చిన్నా రులు భిక్షాటన చేస్తున్నారు. సుమారు పదేండ్లు కూడా నిండని ఈ బాలికల పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇలాంటి వాళ్లు శంషా బాద్లో పదుల సంఖ్యలో ఉన్నారు. పాఠశాలలకు వెళ్లకుండా కిరాణా షాపులు, హౌటళ్లు, పండ్ల దుకాణాలు ఫంక్షర్ షాప్ల్లో మెకానిక్ షెడ్లలో మగ్గి పోతు న్నారు. జరగరాని ఘటన ఎదైన జరిగితే ఎవరిది బాధ్యత. ఇప్పటికైనా అధి కారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.