Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగ నిర్ధారణకు రక్త నమోనాల సేకరణ ప్రతిరోజూ సకాలంలో జరగాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులకు తెలిపారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుంచి వైద్య శాఖ ఆధ్వర్యంలో రక్తనమోనాలు సేకరిం చేందుకు ఏర్పాటు చేసిన రెండు వాహ నాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమోనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌కు వాహనాల ద్వారా తరలించినట్లయితే, సేకరించిన నమోనాల పరీక్షలు నిర్వహించి, ఆ రిపోర్టులను పీహెచ్‌సీకి, రోగి ఫోన్‌కు పంపించనున్నట్టు తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ తో రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుపడుతుందన్నారు. రక్త నమోనాల సేకరణ ప్రతిరోజు వాహనాల ద్వారా జరగాలని ఆదేశించారు. అనంతరం డీ-హబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను, పని తీరును సంబంధిత వైద్య అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కార్యాక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం, డీవై. డీఎంహెచ్‌వో జీవరాజ్, డా. బిజినిల్, డా. అరవింద్, డా. పవిత్ర ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.