Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తపూర్ సర్పంచ్ నాగరాజు గౌడ్
నవతెలంగాణ-మంచాల
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సర్పంచ్ బొడ్డు నాగరాజు గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చిత్త పూర్ గ్రామంలో వ్యాక్సిన్ క్యాంపు ప్రారం భించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహాలకు పోకుండా అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి రాజేశ్, ఎస్ఎంసీ చైర్మెన్ చింతక్రింది కృష్ణ, ఎంపీహెచ్ఏ సూపర్వైజర్ మనోజ్‌కుమార్, ఆశా వర్కర్లు రుక్మిణి, సునంద, అంగన్వాడీ టీచర్ జ్యోతి తదితరులున్నారు.
దోమలో..
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించుకోవాలని సర్పంచ్ కల్పనవెంకటేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గంజిపల్లి గ్రామంలో కో-వ్యాక్సిన్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ కోవిడ్-19 టీకాపై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దనీ, నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరు రూరల్‌లో..
వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలని గుంత బాసుపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ అన్నారు. గురువారం గ్రామంలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో ఏఎన్ఎం సుశీల, పంచాయతీ కార్యదర్శి ఆశా వర్కర్లు, గ్రామస్తులు ఉన్నారు.
కోట్‌పల్లిలో..
కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామస్తులు ఎలాంటి అపోహాలకు పోకుండా, తప్పనిసరిగా తీసుకో వాలని సర్పంచ్ సుభరాణి రాములు అన్నారు. కోట్‌పల్లి మండల పరిధిలోని ఒగ్లపురం గ్రామంలో సర్పంచ్ శోభరాణిరాములు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ప్రజలకూ కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భయబ్రాంతులకు గురికావద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంబికరాజు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులున్నారు.