Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పందన చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ నరేశ్
నవతెలంగాణ-మంచాల
18 ఏండ్ల లోపు పిల్లలకు వివాహలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పందన చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ నరేశ్ అన్నారు.గురువారం మండల పరిధిలోని లొయపల్లి గ్రామంలో స్పందన చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్ల లోపు పిల్లలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే 1098 నంబర్‌కు సంప్ర దించాలని, చైల్డ్ లైన్ అనేది 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు నిర్మూలించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ శోభ, అంగన్వాడీ టీచర్స్ మంగ, సుజాత, స్పందన, చైల్డ్ లైన్ సిబ్బంది అనూష, శిల్ప, గర్భిణుల, బాలింతలు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.