Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
బీజేపీ మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షులు చిలుకూరి బీరప్ప ఆధ్వర్యంలో సేవ సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మణికొండ క్వార్టర్స్ కమిటీ హాల్లో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, సిద్దిపేట జిల్లా ఇన్చార్జి అంజన్ కుమార్, మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె. నరేందర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరం ధన్వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ లక్ష్మీ నారాయణ, కేర్ హాస్పిటల్ సంతోష్ కుమార్, డాక్టర్ సయ్య ద్ మదాన్ని, కేర్ హాస్పిటల్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కాలనీలో ఎంతో మంది ఉచిత వైద్య శిబిరం ద్వారా చికిత్స చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జంగయ్య యాద వ్ జిల్లా సీనియర్ నాయకులు, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రో టోకాల్ ఇన్చార్జి పి.శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీకాంత్ స్వామి, కో-ఆప్షన్ మెంబర్ జె. సిద్దప్ప, జె. లక్ష్మీ, బండ్లగూడ కార్పొరేషన్ అధ్యక్షులు కె.మహేష్‌యాదవ్, సిహెచ్. ఇంది రా, కె.శ్రీనివాస్‌రెడ్డి, కె. నరసయ్యచారి, బి.రవికాంత్‌రెడ్డి, సచిన్‌సింగ్, ఎన్. కేశవాచారి, కె.శంకర్, ఆనంద్ రావు, బి. నరేందర్, వినోద్ సింగ్, బి.ఎన్.మూర్తి, ఈ.జ్ఞానేశ్వర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.