Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణ- ఫరూఖ్ నగర్
రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలులో అక్ర మాలు జరిగాయని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మెన్ అన్వేష్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి తరలివె ళ్లారు. అధికారులకు కిసాన్ కాంగ్రెస్ నేతల వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన కిసాన్ కాంగ్రెస్ రైతులకు అండగా ఉండి వారి సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అక్రమాలపై, రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతు పంటలకు నష్ట పరిహారంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణ జరిపి భాద్యుల మీద చర్యలు తీసుకొని రైతులకు పంట నష్ట పరిహారం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా చైర్మన్ దేవేందర్ రావ్, యాదాద్రి జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు యాది రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మసూద్ ఖాన్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగా రాజు, నాయకులు మల్లేష్ యాదవ్,రమేష్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.