Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెండ్లీల్లకు అండగా ఉంటామని సర్పంచ్ శాంతి తులసీరాం నాయక్ అన్నారు.గురువారం కుల్కచర్ల మండలం పటేల్ చెరువు తండాలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ పింకి వివాహానికి పెండ్లీ కానుకగా క్వింటా సన్న బియ్యం,15 కేజీల వంటనూనె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాలకు తోచిన సహాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. సర్పంచ్ అందిస్తున్న పెండ్లి కానుక పట్ల తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు తులసీరాం నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.