Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
బుద్ధుడు, పూలే అంబేద్కర్ జ్ఞాన మార్గాలను ప్రతి ఒక్కరూ అను సరించాలని మాజీ ఎంపీ, పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఈనెల 14న ఆమనగల్ పట్టణంలో నిర్వ హించనున్న బుద్ధుని మార్గంలో పూలే అంబేద్కర్ జ్ఞాన జాతర ప్రచార రథాన్ని గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో జ్ఞాన జాతర ప్రచార కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానీయుల ఆశయాలను ఆలోచనలను సిద్ధాంతాలను త్యాగాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన పూలే, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్య పరిచేందుకు నిర్వహిస్తున్న జ్ఞాన జాతరలో అందరూ భాగ స్వాములై కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు జ్ఞాన జాతర కమిటీ సభ్యులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండలా ధ్యక్షుడు నర్సింహా, జ్ఞాన జాతర రాష్ట్ర కోఆర్డీనేటర్ జీ సుధాకర్, ప్రధాన కార్యదర్శి కే.జి.శంకర్, జ్ఞాన జాతర కమిటీ ఉపాధ్యక్షులు కొప్పు యాదయ్య (చింతల్ పల్లి సర్పంచ్), కోశాధికారి తాండ్ర రాములు, కమిటీ సభ్యులు సిద్ధిగారి దాసు, కె.వెంకటేష్, ఈ.జంగయ్య, మంగలపల్లి నర్సింహా, కొమ్మగల్ల నర్సింహా, కె.రాములు, విజేందర్, కృష్ణయ్య, కావలి రాములు తదితరులు పాల్గొన్నారు.