Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ వహీదా ఖాతుమ్, ఎంపీడీవో జయరాం అన్నారు. గురువారం మండల అభివృద్ధి కార్యాలయంలో చైల్డ్ లైన్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలలకు సంబంధించిన సమస్యలలో ప్రధానంగా బాల్య వివాహాలే అధికంగా ఉన్నాయనీ, నిర్మూలిం చేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి సిబ్బంది దృష్టికి ఏమైన సమస్యలు వస్తే, అవి 1098 సమాచారం తెలియజేస్తే, పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా సమస్యలను తొంద రగా గుర్తించడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1098నీ పబ్లిక్ స్థలాలలో రాయించాలని కార్య దర్శులకు సూచించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టప్రకారం నేరమని, దీనికి జైలుతో పాటు రూ. లక్షా జరిమానా విధి స్తామని హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ బి.శ్రీనివాస్, ప్రతి నిధి రాములు, ఐసీ పీఎస్ షఫీ, ఆర్ఐ లింగం, ఉపాధ్యాయులు సత్తయ్య, వివిధ శాఖల ప్రతి నిధులు, కార్యదర్శులు పాల్గొన్నారు.