Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ధరూర్ మండలం మోమిన్కలాన్ గ్రామంలో సర్వే నంబరు 10లో ఉన్న ప్రభుత్వ భూమిలో 40 ఏండ్లుగా కబ్జాలో ఉన్న దళిత కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని గురువారం ధరూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్, మండల నాయకులు యాదగిరి మాట్లాడుతూ కొన్నేండ్లుగా కబ్జాలో ఉన్న దళిత కుటుంబాలకు పట్టాలు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. కొంతమంది కబ్జాదారులు సర్వే నెంబర్ 10లో ఆ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏండ్ల నుంచి 30 కుటుంబాలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హైస్కూల్ దగ్గర రోడ్డు పక్కన స్థలము, చెరువు కట్ట, కింది బోరింగ్ దగ్గర అందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు డబ్బు రత్నమ్మ, ఆలంపల్లి పద్మమ్మ, డప్పు సత్యమ్మ, ఈ రాజేశ్, ఈ ఆనందం, పీ.వెంకటయ్య, డీ. ప్రభాకర్, కే. రాజు బాలయ్య, అంజయ్య,భీమయ్య తదితరులు పాల్గొన్నారు.