Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా
సంయుక్త కార్యదర్శి బీసా. సాయిబాబు
నవతెలంగాణ-కొత్తూరు
రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక రోజు సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి బిసా సాయిబాబు పిలుపునిచ్చారు. నేడు నిర్వహిస్తున్న ఒక రోజు సమ్మె వాల్ పోస్టర్ను స్థానిక ఐఐఓసిఎల్ యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల సీఐ టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన కార్మికుల సమస్య లపై నేడు రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాలను కుదించి, నాలుగు కోడులుగా మార్చి, కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. కనీస వేతనాలు చెల్లించాలని జీవో విడుదలైనా, అమలు కాకుండా, యాజమాన్యాలు అడ్డుపడుతున్నాయని దుయ్యబట్టారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు పీిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు తప్పక కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ, 12 గంటల శ్రమ దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కార్మి కులంతా ఏకమై తమ హక్కులు సాధించేవరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, ఐఓసిఎల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.