Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణ - శంషాబాద్
గొప్ప ఆలోచనలు, విలువలు, సూత్రాలతో అద్భు తమైన వ్యక్తిగా మహారాజ అగ్రసేన్ ప్రజల హదయాలలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. అహింసకు చిహ్నం, శాంతి దూత మహారాజ అగ్రసేన్ 5145 జయంతి ఉత్సవాలు తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో గురువారం రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వందలాదిమంది అగర్వాల్ సమాజ ప్రజలు చాలా ఉత్సాహం, ఆనందంతో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు, యువతుల దాండియా నృత్యాలు అందరిని అలరించాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ మహారాజ అగ్రసేన్ నాయకత్వం, దయ, శాంతిని రూపొందించడంలో విశిష్ట ఉదాహరణగా ప్రపంచంలో నిలిచాడని కొనియా డారు. వారి జీవితంలోని ఆలోచనలు, సూత్రాలు, అడుగు జాడలను అనుసరించడం ద్వారా అగ్రసేన్కు గౌరవం, స్వా భావికతను చూపాలని ఆయన కోరారు. అగర్వాల్ సమాజ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, దాదా పు వారందరు వ్యాపార వర్గాలుగా తమ జీవనం కొనసా గిస్తున్నారని, వారు తెలంగాణ రాష్ట్ర పురోగతి, ఆర్థికాభివృ ద్ధికి తోడ్పడుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ అగ ర్వాల్ సమాజ్ అధ్యక్షులు అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ అగర్వాల్ సమాజానికి మూలకర్త, గొప్ప రాజు అగ్రసేన్ జ్ఞాపకార్థం అయన జయంతి రోజును ప్రతిసంవత్సరం ఘనంగా నిర్వహించి సామాజిక సేవలు, అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తామని, అగ్రసేన్ను అనుసరించే వ్యక్తులు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పాలుపంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ రాష్ట్ర నాయకులూ అంకిత్ గుప్తా, ఆశిష్ దోచనీయ, నవీన్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాహుల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.