Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిందితుడు రిమాండ్
వివరాలు వెల్లడించిన సీఐ జలంధర్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
దుకాణం వ్యాపారి రామప్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం కేసుకు సంబంధించిన వివరాలను తాండూర్ రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి వివరించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రిన్స్ అనే యువకుడు సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు ఫ్యాక్టరీ వెనుక ఉన్న కిరాణా కొట్టు వద్దకు వచ్చి ఒక లిక్కర్. స్నాక్స్ సిగరెట్ తీసుకొని లిక్కర్ తాగాడు. లిక్కర్‌కు సంబంధించిన రూ.120 డబ్బులు చెల్లించాడు. స్నాక్స్, సిగరెట్ డబ్బులు ఇవ్వమని అడిగితే తన వద్ద ప్రస్తుతానికి డబ్బులు లేవని, కూలీ డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పాడు. కానీ దుకాణ వ్యాపారి రామప్ప ప్రిన్స్ మాట వినలేదు. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దీంతోపాటు గతంలో కూడా పలుమార్లు ఉద్దెర ఇవ్వలేదు. ఇది మనస్సులో పెట్టుకుని వ్యాపారిని హత్య చేశారు. రామప్ప మృతి చెందగానే కిరాణా కొట్టులో ఉన్న లిక్కర్ బాటిళ్లు, సిగరెట్లు, ఆయన వద్ద నగదు రూ.2050 తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని ఫ్యాక్టరీ ఆవరణలో ఓ పొదల్లో దాచి పెట్టాడు. గురువారం తెల్లవారుజామున తాండూరు నుంచి వికారాబాద్ వెళ్లి రైల్వేస్టేషన్లో గ్రామానికి వెళ్లేందుకు నిరీక్షణ చేస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేయగా నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.