Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
దళిత, గిరిజనులపై దాడులు అరికట్టాలని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలని శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధ ర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్ కోరారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రం లోని కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ధర్నా కరపత్రాలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొ రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందిం చాలన్నారు. సీఎం కేసీఆర్ గతంలో దళితులకు ఇచ్చిన హా మీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలన్నారు. 200 యూనిట్ల వరకు దళితులకు ఉచిత కరెంటు ఇవ్వాలన్నారు. దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు మల్లేష్, సుదర్శన్, రాజు, రాములు, యాదయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, మాణిక్ నాయక్, రామచంద్రయ్య, వెంకటయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.