Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
నవతెలంగాణ-దోమ
పరిగిఎస్సై క్రాంతి కుమార్ రూ.10వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయ ణ తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన మాసని సురేష్, భూమనగారి సాయిరెడ్డి మధ్య గత నెలలో మల్లికార్జున గుడి విషయంలో వాట్సప్ గ్రూపుల్లో జరిగిన వివాదం విషయమై పరిగి పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేశారు. తర్వాత ఆ కేసుకు సంబంధించి ఫిర్యాదు దారు లు ఇరువురు కాంప్రమైజ్ అయ్యారు. కాగా ఆ కేసు విష యంలో సాయిరెడ్డి చిన్నాన్న అయినా పరశు రామ్‌రెడ్డిని ఎస్సై రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో పరశురామ్రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం పరిగి పట్టణంలోని స్వాగత్ హౌటల్ దగ్గర ఎస్ఐ క్రాంతి కుమార్‌కు రూ.10వేలు పరశు రామ్‌రెడ్డి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబి అధికారులు తదితరులు పాల్గొన్నారు.