Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్పాదక సంస్థలలో మహిళ సంఘాలను ప్రోత్సహించాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జిల్లా అధికారులతో సమీక్ష
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
స్వయం సహాయక సంఘాలు( ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. విన్నూతమైన ఆలోచనలతో, వివిధ రకాల ఉత్పాదక సంస్థల స్థాపనకు పొదుపు సంఘాల మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్హె చ్జీ గ్రూపుల బలోపేతంపై గురువారం జిల్లా కలెక్టర్ అమో రు కుమార్, ఆయా శాఖల అధికారులతో కలిసి తన ఛాంబర్లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రధాన రోడ్ల ప్రక్కన పొదుపు గ్రూపుల వారు సృజనాత్మకమైన ఆలోచనలతో వివిధ వస్తూ తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస ినట్టు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3,500 వరకు గ్రామాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు చిరు వ్యాపారాలు, దుకాణాలు ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు. జిల్లాలోని మొయి నాబాద్, చేవెళ్ల, కడ్తాల్ మండలాలు, బడంగ్పేట్, మీర్ పేట్, బండ్లగూడా కార్పొరేషన్లు, షాద్‌నగర్, శంకర్పల్లి, శంషాబాద్, తుక్కుగూడా మున్సిపాలిటీల పరిధిలో అన్ని ఒకే చోట కేంద్రీకృతం అయ్యేటట్టు యూనిట్లు ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి, యూ నిట్ల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు అందివ్వనున్నట్టు తెలి పారు. వీటి ఏర్పాటుకు సంఘాల వారు 10 శాతం నిధులు, సబ్సిడీ 35 శాతం, బ్యాంక్ రుణం 55 శాతం ఉంటుందని తెలిపారు. డీఆర్డీఏ, మెప్మా అధికారులు, అలిప్ సంస్థ ప్రతి నిధులు మార్కెటింగ్ తదితర వాటిపై దృష్టి పెట్టాలన్నారు. కూరగాయల హబ్‌గా ఈ ప్రాంతానికి పెరు ఉందని, వాటిని వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కట్ చేసి ప్యాకింగ్ లాంటివి చేపట్టాలని అన్నారు. అనేక రకాల ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, రెస్టారెంట్ లాంటివి ఏర్పాటు చేసి గ్రూపులు ఆర్థికంగా ఎదగడానికి, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు స్థాపించేలా సంఘాల సభ్యులను ప్రోత్సాహిం చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, మెప్మా జిల్లా కో-ఆర్డినేటర్ హన్మంత్‌రెడ్డి, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రర్ఫ్రైజర్స్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ అజరు బాబు పాల్గొన్నారు.