Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి
పలు రేషన్ షాప్లు తనిఖీ
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రేషన్ షాపులను ఎంపిక చేసుకొని 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు రేషన్ సరుకులు వారి ఇంటి వద్దకు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లిలో రేషన్ షాపును, శివారెడ్డిపేటలోని ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ సెంటర్ను సందర్శించా రు. ఎన్నెపల్లిలోని రేషన్ షాపులో ఓటీపీ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భం గా కొంతమంది లబ్ధిదారులు కార్డు ఉండి కూడా రేషన్ బియ్యం రావడం లేదని కమిషనర్ దృష్టికి తీడుకోరాగా, అయన స్పందిస్తూ అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రతి రేషన్ షాపు వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ అందే విధంగా చూడాలన్నారు. రేషన్ షాపులలో బియ్యంతో పాటు చెక్కర కూడా అందించాలని డీలర్లను సూచించారు. శివారెడ్డిపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాల (ఉర్దూ మీడియం)ను పరిశీలించారు. గర్భిణులకు, బాలిం తలకు, విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. అందిస్తున్న మినును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఏఎన్ఎంలతో మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అంతకుముందు ధరూర్ మండలంలోని కేరెళ్ళే గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు మంచి వైద్యం, పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. పాఠశాల ఆవరణలో అధికారులతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీఓ కృష్ణన్, డీడబ్ల్యూఓ లలితా కుమారి, డీసీఎస్ఓ రాజేశ్వర్, డీఎం సివిల్ సప్లై విమల, డీఎంఅండ్హెచ్ఓ జీవరాజ్ తదితరులు పాల్గొన్నారు.