Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న
నాగారం : దళిత బంద్ తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు వర్తింపజేయాలని వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎపూరి సోమన్న అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలో వీరారెడ్డి స్తూపం వద్ద చేపట్టిన దీక్షలో పాల్గొని మాట్లా డారు.నియోజకవర్గంలోని అన్ని మండలాలకు దళితబంధు ఇచ్చి దళితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హుజూరా బాద్‌లోని దళితుల ఓట్ల కోసమే ముఖ్యమంత్రి దళితబంధు పథకం ప్రవేశపెట్టా రన్నారు. నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అన్ని మండలాల్లో దళితబంధు పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.నియోజకవర్గ ఎమ్మె ల్యేకు అభివద్ధి కంటే ఆదాయం మీదే ఆలోచనలు ఎక్కువగా ఉన్నా యని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యా మ్నాయంగా వైయస్సార్ టీపీ మారబోతు ందన్నారు. రాష్ట్రంలో అప్రజా స్వామిక వ్యవస్థ రాజ్యమేలు తుంద న్నారు. రాజ్యాంగబద్ధంగా దీక్ష చేయడం కోసం మైకు పర్మిషన్ అడిగితే ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టల రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు గౌతం ప్రసాద్,రాజ్‌కుమార్, రాజు, రాము, ఉదయరాజు, పరుశరాములు, నాగరాజ్‌గౌడ్, కల్పన, గాయత్రి, గిలకకత్తుల రమేష్‌గౌడ్, మండల కన్వీనర్ చిత్తలూరు ఎల్లయ్య, బొజ్జ సైదులు, అనుదీప్, పేరాల యాదగిరి, శ్రీకాంత్ పాల్గొన్నారు.