Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు జీవనాధారమైన నక్కలగండి, డిండి ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం తమసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.తహసీల్దార్ దేశ్యనాయక్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టులకు నిధులు కేేటాయి ంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. నక్కలగండి ప్రాజెక్టుకు 2005లో సర్వే చేసి 2007లో శంకుస్థాపన చేసినప్పటికీ నేటికి నత్తనడక నడవడం బాధాకర మన్నారు.కేసీఆర్ 2014లో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా మాటలు నీటిమూటలుగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉత్తర తెలంగాణ కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోతే ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, వెంకటయ్య, హనుమంతు పాల్గొన్నారు.