Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిం చామని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.శుక్రవారం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో వివరాలు వెల్లడించారు.శుక్రవారం ఉదయం పోలీసులు పట్టణంలోని శివాలయం వీధిలో గస్తీ నిర్వహి స్తుండగా నేరస్తులు అనుమా నాస్పదంగా తిరుగు తుండడంతో సిబ్బంది వారిని పట్టుబడి చేసి విచారించగా నేరాలను ఒప్పుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కసినగర్కు చెందిన సయ్యద్ సదుల్లా, ఎస్కె.అలీ జాఫర్, ఎస్కె.షరీఫ్, ఎస్కె.అజీమ్‌తో పాటు మరో ఇద్దరు కలిసి జాతీయ రహదారి వెంబడి గల దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నేరస్తులు వారికున్న రెండు బైకుల మీద ఉదయం వేళలో రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆలయాలలో ఆభరణాలతో పాటు హుండీలో ఉన్న సొమ్ము కాజేసి వాటితో మద్యం సేవించడం, వారి అవసరాలకు వాడు కుంటున్నారు. ఈ ముఠా జిల్లాలో ఏడు దేవాలయాలలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12, మాన కొండూరు ప్రాంతంలో మూడు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడ్డారు.వీరి నుండి రూ. 21800 నగదుతో పాటు నాలుగు సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. దొంగతనాలకు పాల్పడిన ఆరుగురిలో నలుగుర్ని రిమాండ్‌కు పంపారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.ఈ సమా వేశంలో నకిరేకల్, శాలిగౌరారం సీఐలు కె.నాగరాజు, పి.నాగదుర్గా ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.