Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యలను వెలికితీసి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేందుకు ప్రతి కార్యకర్తా సిద్ధం కావాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణం లోని నర్రారాఘవరెడ్డి భవనంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జిట్టా నగేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటాలు చేయాలన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు.ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేసి వారిని పోరాటాల దిశగా చైతన్యం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఆర్ వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్నవెంకులు, మండల కార్యదర్శులు, ప్రజా సఘాల ప్రతినిధులు అవిశెట్టి శంకరయ్య, చెన్నబోయిన నాగమణి, పెంజర్ల సైదులు, కుమ్మరిశంకర్, ఆరూరి శ్రీను, చెరుకు పెద్దులు, మర్రి వెంకటయ్య, ఆదిమల్ల సుధీర్, మహేష్, నరేష్ పాల్గొన్నారు.