Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-తిప్పర్తి
నవంబర్ 1,2,3వ తేదీల్లో నల్లగొండలో సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు నిర్వహించ నున్నామని, ఆ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు.శుక్రవారం మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డిభవన్లో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.నల్లగొండలో జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగసభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లాలో సాగునీటి సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఘనత తమపార్టీకే ఉందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై అనునిత్యం పోరాటం చేస్తున్న పార్టీ తమదేన్నారు.జిల్లాలో భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి మరిన్ని పోరాటాలకు సిద్ధం కావడానికి ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మన్నెంభిక్షం, నాయకులు నన్నూరి వెంకటరమణారెడ్డి, బీరెడ్డి సీతారాంరెడ్డి, లతీఫ్, భీమగాని గణేష్,గంటెకంపు రమణయ్య, పోకల శశిధర్ పాల్గొన్నారు.