Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
నాయకులు అరెస్టు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
పలువురు నాయకులకు గాయాలు
నవతెలంగాణ-నల్లగొండ
73 షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాల జీవోలు సవరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె లో భాగంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాల జీవో సాధనే లక్ష్యంగా, లేబర్ కోడ్ రద్దే మన గమ్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా ప్రభుత్వం కొత్త రాష్ట్రంలోనూ పాత ఆంధ్రప్రదేశ్ కాలం నాటి జీఓలను కొనసాగిస్తుందన్నారు.73 షెడ్యూల్ పరిశ్రమల్లో దశాబ్దకాలం గడిచినా కొత్త జీవోలు విడుదల చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.2015లోనే టీఎస్ఐపాస్ చట్టం తెచ్చి పారిశ్రామికాధిపతులకు భూములు, రాయితీలు ఇచ్చి సకల మర్యాదలు చేసిన ప్రభుత్వానికి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే సోయిమాత్రం లేదన్నారు.ఇంకా మాయమాటలతో, గారడీ వాగ్దానాలతో కాలమెళ్ల బుచ్చుతుం దన్నారు.మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 ఏండ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను , నాలుగు లేబర్కోడ్లను మార్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు ఒడిగట్టిందని విమర్శించారు.దేశ సహజవనరులను, ప్రజాసంపదను, ప్రభుత్వరంగసంస్థలను స్వదేశీ,విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతున్నదని విమర్శించారు.ముట్టడి సందర్భంగా నాయకులు వీరారెడ్డి, సలీం, దండెంపల్లి సత్తయ్య, కుంభం కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డిలను అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నాయకులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు సీఐటీయూ నాయకులకు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయకార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నర్సింహ, పోలే సత్యనారాయణ , మున్సిపల్, హమాలీ, పవర్లూమ్, భవన నిర్మాణ కార్మికులు సంతోష్, పెరిక అంజమ్మ,దాసారపు రమేష్, పెరిక కష్ణ, పేర్ల సంజీవ, నాగుల కరుణ,కర్నాటి శ్రీరంగం, దొమ్మాటి యాదగిరి, పాండు,రామలింగం, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభంకష్ణారెడ్డి, ఊట్కూరి మధుసూదన్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.