Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
సిలబస్ పూర్తి చేయకుండానే ఇంటర్ఫస్టియర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికలజూనియర్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడారు.ప్రభుత్వం వెంటనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైంటేబుల్ విడుదల చేసిందన్నారు.రాష్ట్రంలో 18 నెలలుగా కరోనా తీవ్ర రూపంలో విజంభించి రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడ్డాయన్నారు.దీంతో విద్యార్థులు పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో 2019-2020 విద్యా సంవత్సరం విద్యార్థులను ప్రభుత్వం ప్రమోట్ చేసిందన్నారు.2020-2021 విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశారని కానీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు సిద్ధం చేస్తుందన్నారు.కానీ ఈ 18నెలల కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 1700 గెస్ట్లెక్చరర్ పోస్టులు రెన్యువల్ చేయలేదన్నారు.దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఆన్లైన్లో కూడా తరగతులు జరగకుండా లెక్చరర్స్ లేక పాఠాలు జరగక టీవీ పాఠాలు అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బోగరి సుకుమార్, కొండ సిద్ధార్థ,కళాశాల నాయకురాళ్లు ధనలక్ష్మీ, మాధురి,శృతి, కావ్య, జ్యోతి, రజిని, చైతన్య, పద్మ, సౌజన్య, పూజ పాల్గొన్నారు.