Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
గవర్నర్ డాక్టర్ తమిళ్సై సౌందరరాజన్‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్,ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నోడల్ అధికారి డాక్టర్ బి.ధర్మా నాయక్ శుక్రవారం రాజ్‌భవన్‌లో కలిశారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల కావాల్సిన విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారంపై ఇటీవల దేవరకొండ నియోజకవర్గంలోని మర్రిచెట్టుతండాలో నిర్వహించిన సర్వే, అవగాహనా సదస్సు వివరాల నివేదికను వివరించారు.రాష్ట్రంలో చాలా వెనుకబడిన గిరిజన, శిశువు బాల బాలికలు విద్యార్థిని విద్యార్థులు మహిళల అభివద్ధికి, మౌలికసదుపాయాల కల్పన కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టా లన్నారు.ఈసందర్భంగా డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు నేతత్వంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల అభివద్ధి కోసం ప్రతి తండా,ఆదివాసీలగూడెంకు వెళ్లి సర్వే నిర్వహించి నివేదికలను యూనివర్సిటీ ద్వారా అందజేస్తామని తెలిపారు.