Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ పనిచేస్తుందని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పుల్లారావు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లా డారు.ప్రజల ఆరోగ్యమే కాకుండా సమాజం కోసం కూడా ఐఎంఏ పని చేస్తుం దన్నారు.వత్తిపరంగా ఆస్పత్రుల పైన డాక్టర్ పైన ఎవరైనా దాడులు చేస్తే ఐఎంఏ ఎల్లప్పుడూ ముందుంటుందని పర్కొన్నారు. 2021, 22 నీలగిరి బ్రాంచి నూతన కమిటీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. హల్త్పరంగా కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో నూతన నీలగిరి అధ్యక్షులు పీవీఎన్.మూర్తి, ప్రధాన కార్యదర్శి, డాక్టర్ అనితారాణి, సహాయ కార్యదర్శి అనూష, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాశ్‌రెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.