Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపి దోపిడీని బయటికి తీస్తా
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ - బొమ్మలరామరం
జిల్లాలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ నాయకులే చైర్మెన్లుగా ఉండి రైతులను తాళి, తరుగు పేరుతో మోసం చేసి, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రూ.కోట్లు దండుకున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని కాజీపేట గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు. రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్‌రెడ్డి తండ్రి రంగారెడ్డి అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందడంతో హేమంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అనలేదని చెప్పడం సరికాదన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు యాంజాల కళ, రాంపల్లి మహేష్‌గౌడ్, ఎంపీటీసీలు ఎర్వ హేమంత్‌రెడ్డి, శ్రీహరినాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సింగీర్తి మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి ఆగంరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బాసారం బాబు, బీర్లఅయిలయ్య యువజన నియోజక వర్గ అధ్యక్షులు జూపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.