Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరిరూరల్
సంస్కృతి వెల్లివిరిసేలా బతుకమ్మ పండుగ నిర్వహించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని చెరువులు, కుంటల వద్ద శుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. అవసరమై న చోట మరమ్మతులు చేయాలని, బతుకమ్మ పండుగ పోటీలు నిర్వహించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో బహుమతులు ప్రదానం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మలో పాల్గొనేందుకు మహిళా సంఘాలను ఏరియా కోఆర్డినేటర్ల ద్వారా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఏర్పాటు చేయాలన్నారు. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పెద్ద చెరువు వద్ద నీటి పారుదల శాఖ, మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని, జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. బందోబస్తు నిర్వహించాలని పోలీస్ డిప్యూటీ కమిషనర్‌ను సూచించారు.